నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో పని చేస్తూ ఇటీవల తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికురాలు జిట్టా మణెమ్మను ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా మణెమ్మ కుటుంబ సభ్యులకు రూ. 5000 ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa