ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 04:27 PM

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-వరంగల్ వెళ్తున్న లారీని.. వెనకాలే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa