విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 , 8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి రాణించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa