గుండెపోటుతో ఓ మహిళ RTC బస్సులోనే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన మణెమ్మ(58) కోడలు లతతో కలిసి కాల్వ శ్రీరాంపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో మణెమ్మ అస్వస్థతకు గురవగా గమనించిన కండక్టర్, డ్రైవర్ బస్సులోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గెండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa