జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ ముందు అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం వివాదానికి దారి తీసింది. మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే కె.వి.ఆర్ తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ నిర్మాణాన్ని కూల్చివేయడంతో ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయం చేరుకుని కమిషనర్ సుజాత, టిపీఓ గంగాధర్, టీపీఎస్ రాజేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa