సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ చెప్పారు. బుధవారం భిక్కనూరు మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను మిషన్ భగీరథ సర్వే పరిశీలించారు. అనంతరం బస్వాపూర్ గ్రామంలో గల ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa