తన కొడుకు తనకంటే ముందే మృతి చెందడంతో మానసికంగా వేదనకు గురై ఓ వృద్ధుడు ఆత్మహత్య కు పాల్పడిన బుధవారం కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుంబాల పెంటయ్య (53) కొడుకు ఇటీవల మృతి చెందాడు. ఆ బాధను జీర్ణించుకోలేక బుధవారం తన పశువుల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa