ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయలైన ఘటన మఠంపల్లి ఆదర్శ పాఠశాల సమీపంలో బుధవారం జరిగింది. కొత్తదొనబండ తండా నుంచి మఠంపల్లికి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని మండల కేంద్రం నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్పంగా గాయాలు కాగా, మరో వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa