ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలపట్ల తల్లిదండ్రులు తస్మాస్ జాగ్రత్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:10 PM

దసరా సెలవుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలపట్ల తల్లిదండ్రులు జగ్రత్తగా ఉండాలని ఎస్సై విజయ్ కుమార్ సూచించారు. కంగ్టి మండలలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై విజయ్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ...మండల పరిధిలోని విద్యార్థులకు దసరా సెలవుల సందర్బంగా ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడని అన్నారు. చెరువులు, నదుల వద్దకు  ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదల  బారిన పడి ప్రాణలు పోగోటుకూతున్నారు. కావున తల్లి దండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు.హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలు తిరిగి హాస్టల్ కు వెళ్లేంతవరకు తల్లిదండ్రులదే భాద్యత  అన్నారు.చెడు వ్యాసనాలకు పిల్లలు బానిసకాకుండా చూడాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa