ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:14 PM

హుస్నాబాద్ పట్టణంలోని  7వ తేదీ సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అరుణోదయ విమలక్క హాజరు కానున్నారు. ఇట్టి కార్యక్రమ సందర్భంగా ఈరోజు కోహెడ మండల కేంద్రము లోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన బతుకమ్మ కార్యక్రమ వాల్ పోస్టర్స్,కరపత్రాలను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద ధర్మయ్య మాట్లాడుతూ స్త్రీలపై జరుగుతున్న దాడులకు అఘాయిత్యాలకు నిరసనగా స్త్రీల ఆత్మగౌరవానికి రక్షణగా బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమలక్క  నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మన హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో స్త్రీలకు మద్దతుగా ప్రకృతి విధ్వంశాన్ని ఆపేలా  మహిళల్లో చైతన్యం నింపి పోరాట ధైర్యాన్ని కల్పించడంతోపాటు సమాజంలో యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా  కార్యక్రమం నిర్వహణ ఉంటుందని తెలిపారు.బహుజనులు అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద ధర్మయ్య కోరారు.ఇట్టి కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు మార్క అనిల్ గౌడ్, దండి లక్ష్మి , శ్రీదేవి కోడూరి , ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, నాంపల్లి సమ్మయ్య, మెతుకు కొమురయ్య,  జిల్లా కాంగ్రెస్ నాయకులు బసవరాజ్ శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య, కోహెడ మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, ముంజ శ్రీనివాస్, శెట్టి సుధాకర్, బోయిని జయరాజ్, కైతదాసు, చెల్లూరు లింగం, దూలం శ్రీనివాస్, రవి,చక్రపాణి, వేల్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa