ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండా సురేఖ వాఖ్యలపై స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 12:43 PM

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు సురేఖ కామెంట్స్‌ను ఖండించగా.. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ విచారం వ్యక్తం చేశారు.'స్త్రీలను క్లిక్ బైట్‌లుగా, సంచలనాలకు థంబ్‌నెయిల్‌లుగా చూస్తున్నారు. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. కష్టపడి పైకి ఎదగడం తప్పు కాదు కదా. మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం. సిట్టింగ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాటలు విని షాక్ అయ్యాను. అన్ని విషయాలను రాజకీయాల కోసం వాడుకోవద్దు. ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించాలి' అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa