ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:41 PM

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్,జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తో కలిసి ఆయా ప్రాంతాల్లో  పర్యటన. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు అయాశాఖల అధికారులతో కలిసి శుక్రవారం జాయింట్ ఇన్స్పెక్షన్  చేపట్టారు.  జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్,శేరిలింగంపల్లి  జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ట్రిడెంట్ హెటల్ నుంచి యశోదా ఆసుపత్రి వరకు ఉన్న 5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు.  ఆయా ప్రాంతాలలో ఉన్న జలమండలి సీవరేజ్ పైపులైన్లు, ఎయిర్ వాల్వ్‌ల తరలింపు ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే మాదాపూర్, మైండ్ స్పేస్, ప్రాంతాల వారికి  ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa