ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబర్ హర్షసాయికి మరోషాక్.. నోటీసులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:51 PM

యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే.. హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన నటి.. నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని బాధిత నటి.. ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపించింది. అంతేకాకుండా.. నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి.. హర్షసాయి కోసం గాలింపు మొదలుపెట్టారు.


కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉండగా.. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. చిక్కడు దొరకడు అన్నట్టుగా హర్షసాయి మాత్రం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టి.. అప్పటి నుంచి అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు. అయితే.. హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ సైబరాబాద్ సీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో.. హర్షసాయి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి.. ఆ మార్గాన్ని కూడా క్లోజ్ చేశారు. అయితే.. హర్షసాయి ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోనే ఉన్నప్పటికీ.. ఎవ్వరికీ దొరకకుండా హర్షసాయి అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.


అయితే.. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ.. ఓ సాధారణ యువకుడి నుంచి హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాధించాడు హర్షసాయి. మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు తనదైన స్టైల్‌లో సాయం చేసి.. వాళ్లను సర్‌ప్రైజ్ చేస్తూ.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించాడు హర్షసాయి. హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా హర్షసాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతటి పేరున్న హర్షసాయి.. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.


మొన్నటి వరకు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాధిస్తున్నాడంటూ.. మిగతా యూట్యూబర్లు హర్షసాయిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన హర్షసాయి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో.. ఆ పంచాయితీ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. కాగా.. కొత్తగా ఈ రేప్ కేసు కూడా నమోదవటంతో.. హర్షసాయిని ఒక్కసారిగా వివాదాలు చుట్టు ముట్టాయి. దీంతో.. హర్షసాయి ఇప్పుడు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa