ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టరేట్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 09:37 PM

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు.
వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు ఆయా డిపార్ట్మెంట్ ల మహిళా అధికారులు, ఉద్యోగినులు, సిబ్బంది రంగురంగుల పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్దారు. అనంతరం చిత్తు.. చిత్తుల బొమ్మ.., ఒక్కేసి పువ్వేసి చందమామ పాటలకు ఆడి పాడారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మహిళా అధికారులు, ఉద్యోగినులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa