హైదరాబాద్ నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ కొత్త శాటిలైట్ టెర్మినల్ మరికొన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. 99 శాతం పనులు పూర్తి చేసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో సకల సౌకర్యాలు ఉండనున్నాయి. ఎయిర్‌పోర్టుకు ఏమాత్రం తీసిపోకుండా ఈ స్టేషన్ అభివృద్ధి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa