గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. గత మూడు నెలల కాలంలో వందల నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేసారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయింది. అయితే హైడ్రా కూల్చివేతలపై కొ న్ని వర్గాల నుంచి వ్యతిరేకత, హైడ్రా చట్టబద్దతపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు.
అయితే ఇటీవల హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో హైడ్రాకు హై పవర్స్ వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో హైడ్రా బుల్డోజర్లు దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. హిమాయత్ సాగర్ జలాశయం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తోంది. అక్కడ భారీ ఎత్తున బిల్డింగులు నిర్మించటంతో వాటిపై ఫోకస్ పెట్టారు. హిమాయత్ సాగర్ సర్వే పూర్తి అయిన వెంటనే అక్రమ కట్టడాలను నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం ఉస్మాన్ సాగర్‌పై దృష్టి పెట్టేలా హైడ్రా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 549 చెరువులకు హైడ్రా సర్వే చేపట్టనుంది. అందుకు అనుగుణంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పక్కాగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను డిసైడ్ చేస్తున్నారు. వాటికి జియో ట్యాగింగ్ చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa