మెట్ పల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి అక్రమ తరలింపులపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. వారంలో రెండు గంజాయి తరలింపు కేసులను చాక చక్యంగా చెదించడంలో పోలీసులు చురుకుగా వ్యవహరిస్తున్నారు.మంగళవారం గంజాయి తరలిస్తూ పట్టుపడ్డ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మెట్ ల్లి పట్టణానికి చెందిన లోకిని వంశీ, కోయల్ కార్ రమేష్, లోకిని విగ్నేష్ లు ఒకే ద్విచక్ర వాహనం పై ఆర్మూర్ నుండి మెట్ పల్లి జాతీయ రహదారి వెంట వస్తుండగా బండలింగాపూర్ క్రాసింగ్ వద్దఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ వాహనా తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 220 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.