ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 02:47 PM

పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల స్పెషల్ అధికారి డీఎఫ్ఓ సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న  భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మెనూ  పాటించాలని  విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని నాచిరకమైన భోజనం  అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వాణికి సూచించారు. అనంతరం గురుకుల హాస్టల్ చుట్టూ పరిశుభ్రత పాటించాలని,  డైనింగ్ హాల్ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa