ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే శంషాబాద్ నుంచి రావాల్సిన శంషాబాద్-చెన్నై, శంషాబాద్ తిరుపతి విమానాలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa