రైతులు పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి నిఖిల అన్నారు. బుధవారం మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశుసంపద అభివృద్ధి కోసం ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తమ పశువులకు ఎలాంటి జబ్బులు ఉన్న సిబ్బందికి తెలియజేయాలని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స, నట్టల నివారణ మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఏ రాజిరెడ్డి, ఓఎస్ వెంకటయ్య, స్వామి, గోపాలమిత్ర సూపర్వైజర్ భాస్కర్ గౌడ్, గోపాలమిత్రలు స్వామి, హర్షద్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa