ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 11:41 AM

సిద్ధిపేట పోలీసు కమిషనర్ కార్యాలయ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ ను సిద్దిపేట పట్టణంలో ఉన్న మమత కంటి ఆసుపత్రి, రిచ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, శ్రీ మంజునాథ గ్యాస్ట్రో లివర్ మెటర్నటీ హాస్పిటల్ సౌజన్యంతో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ మెడికల్ క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేసుకున్నారు. 
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. 
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా బారినపడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలలో కల్తీ ఉంటుందని జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు. 
కంటి కంటి పరీక్షలు, చిల్డ్రన్స్  పరీక్షలు గ్యాస్ట్రో లివర్ పరీక్షలు మహిళలకు మెటర్నటీ సమస్యలు పరిశీలించి ప్రాథమిక పరీక్షలు చేయడం జరిగింది. మమతా కంటి ఆసుపత్రి డాక్టర్లు  డాక్టర్ వి. సురేష్ రెడ్డి, జి మమతారెడ్డి, రిచ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్స్ యం. రవితేజ గౌడ్, ఏ సంతోష్ కుమార్, శ్రీ మంజునాథ హాస్పిటల్ డాక్టర్స్ పోతుగంటి దుర్గరెడ్డి, రాచకొండ సాయిశ్రీ వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, మరియు ముఖ్యంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో ఉదారత చూపిన సిద్దిపేట వివిధ ఆసుపత్రుల యాజమాన్యానికి మరియు డాక్టర్లకు కమిషనర్ మేడమ్  కృతజ్ఞతలు తెలిపినారు. పోలీసు అధికారులు సిబ్బంది వారు కుటుంబ సభ్యులు 320 మంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగినది. 
సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల సిపి మేడమ్ తీసుకుంటున్న శ్రద్ధ విశేషమైనదని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసినందుకు అధికారులు సిబ్బంది సిపి మేడమ్ కి ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డిసిపి యస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, రాజేష్, పూర్ణచందర్, విష్ణు ప్రసాద్, కార్తీక్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది హోంగార్డులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com