పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి సన్నిధిలో బుధవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రాములు నాయక్ నేతృత్వంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ.
అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తది తర కార్యక్రమాలు ఆలయ ఈవో, చైర్మన్‌తో పాటు అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.