కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామం సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో పలు ఆసక్తికరమైన తప్పుడు లెక్కలు, పొరపాటులను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా రైస్ మిల్లులో గత రెండు సంవత్సరాలుగా నుంచి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించారని, దీంతో ఏడు క్వింటాళ్ల వరి తేడా వచ్చాయన్నారు.
నిర్వహిస్తున్న లెక్కలలో పలు తేడాలున్నాయని, కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసినప్పటికీ అధికారికంగా తప్పుడు లెక్కలు చూపించి మిగతా వాటిని బ్లాక్ మనీగా ఉపయోగించడం జరిగిందని, ఇట్టి విషయాన్ని ఫిర్యాదుతో పాటు జుక్కల్ పోలీసులకు అందించడంతో జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.