కామారెడ్డి ప్రభుత్వం అందించే ఆసరా పథకానికి సదరం క్యాంపులో ధృవ పత్రం ఉండాలి. దీనికి సంబంధించిన సదరం క్యాంపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే పలు సంక్షేమ పథకాల అర్హత పొందడానికై అర్హతలు కలిగి ఉన్న వారు సదరం క్యాంపులో పాల్గొని సంబంధిత వైద్యులతో ధృవీకరణ పత్రం పొందుతారు. దీనికై బుధవారం సదరం క్యాంపులో కొందరు వయోవృద్ధులు పిల్లలు ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ సంతోష్ కోసం దాదాపు రెండున్నర గంటల పాటు నిరీక్షిస్తూ అసహనానికి గురయ్యారు.
వాస్తవానికి సదరం క్యాంపు ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ లో ఉదయం 9 గంటలకే సమయం ఇచ్చారు. దానికనుగుణంగా సంబంధించిన రోగులు ఉదయం 9 కంటే అరగంట ముందు నుంచే ఈఎన్టీ వైద్యుడి కోసం వేచి చూస్తున్నారు. కానీ ఉదయం 10 గంటల 45 నిమిషాలు కావస్తున్నా సదరు ఆ వైద్యుడు రాకపోవడం గమనార్హం. ఈ విషయమై సుపరిండెంట్ కు వివరణ కోరగా వెంటనే ఆమె తన ఛాంబర్లో ఆ వైద్యుడిని పిలిపించి అడుగగా నాకు ఈ వృత్తి కంటే నా వ్యక్తిగత పనులే ముఖ్యమని ఎమ్మెల్యే కు కానీ విలేకరులకు సమాధానం ఇచ్చేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చివరికి సుపరిండెంట్ కే సస్పెండ్ చేస్తారా చేస్కోండి అని చిటికె కొట్టుకుంటూ పోవడం సినిమా సీన్ లాగానే కనబడుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఇట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన దురుసు స్వభావం కలిగినటువంటి సదరు ఈఎన్టీ వైద్యుడు సంతోష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.