వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలో నీ గొట్టిముక్కల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గొదుమగూడ ప్రాథమికోన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ సుధీర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని, డైనింగ్ హాల్ ను పరిశీలించి విద్యార్థులతో కలసి అదనపు కలెక్టర్ భోజనం చేశారు.
వంట చేసేటప్పుడు విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో ఎఎచేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వంట గదిని ఎప్పుడు పరిశుభ్రంగా వుండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అకస్మిక తనిఖీలో ఆర్డిఓ వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు.