పెద్దపల్లి పట్టణంలో రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిలు/ యువకులకు అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో పట్టణంలో ఉన్న పాన్ షాప్ లను రాత్రి 10 గంటల లోపే మూసివేయాలని పాన్ షాప్ యాజమానులను పెద్దపల్లి ఏసిపి.జి.కృష్ణ అదేశించనైనది.
అలాగే ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మడంకాని, హుక్కా పాయింట్ లు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకొబడునని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో రాత్రి వేళలో ఆపరేషన్ చబూత్ర నిర్వహిస్తూ పట్టణం లో రాత్రి వేళలో తిరుగుతున్న ఆకతాయిల ను పట్టుకొని కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపినారు.