హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి మండలంలోని కురుమలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కురుమ సంఘం చేవెళ్ల మండలాధ్యక్షులు కసిరే వెంకటేష్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన కర పత్రాలను కురుమ సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమలంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధనకు పోరాటం చేయాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్న అన్ని స్థానాల్లో కురుమలు పోటీచేసి రాజకీయంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల ఉపాధ్యక్షులు దండ సత్యం, ఎర్ర మల్లేష్, సాయినాథ్, కోశాధికారి పడమటి వెంకటేష్, కార్యదర్శి తిరుమల కుమార్, సలహాదారులు పెద్దొళ్ల ప్రభాకర్, సభ్యులు రాములు, గుడెపు ప్రవీణ్, శంకరయ్య, ఎర్ర శంకరయ్య, మల్లేష్, శ్రీనివాస్, మీడియా ఇంచార్జ్ రఘు, తదితరులు పాల్గొన్నారు.