సరిహద్దుల వెంట అక్రమ రవాణాలు అరికడతామని తెలంగాణ మల్టీ జోన్-ll ఐజిపి కే.సత్యనారాయణ ఐపిఎస్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగాల, హుజూర్నగర్ సిఐలు పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ వందనం తో స్వాగతం తెలిపారు. ముందుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిశీలించి కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు నిర్వహిస్తున్న రికార్డ్స్ తనిఖీ చేసి సలహాలు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ నిర్వహణ పోలీసింగ్ నిర్వహణ సక్రమంగా జరుగుతున్న అన్ని సిబ్బందిని సీఐ రజిత రెడ్డి ను అభినందిస్తున్నాను అన్నారు. సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున సన్నధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున మన రాష్ట్రంలోకి ఆంధ్ర నుండి వరి ధాన్యం రాకుండా కృషి చేస్తున్నామన్నారు.
ఇతర శాఖ అధికారులతో కలిసి పోస్టుల వద్ద అప్రమత్తంగా పనిచేస్తూ ఆంధ్ర వైపు నుండి ఇక్కడికి వరి ధాన్యం రాకుండా రైతులకు అండగా పనిచేస్తున్నాము అన్నారు. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కృషి చేస్తున్నామన్నారు.పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పై కేసులు నమోదు చేసి బారుగా బియ్యం స్వాధీనం చేసుకున్నాము. తరచూ పిడిఎస్ బియ్యం అక్రమ దందాకు పాల్పడుతున్న నరసింహ రావు, జగదీష్ అనే నిందితులపై పీడియాక్ట్ పెట్టడం జరిగిందన్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి పెద్ద మొత్తంలో వస్తున్న గంజాయి నిరోధించడం పోలీస్ స్నేహ బాగా పెరిగి పెద్ద మొత్తంలో తరలించే గంజాయి సీజ్ చేస్తున్నామన్నారు. అక్రమ రవాణాను పటిష్టంగా నిర్మూలిస్తున్నామని ఐజి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత రెడ్డి, మునగల సీఐ రామకృష్ణారెడ్డి, హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, సబ్ డివిజన్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.