చిన్న పిల్లలకు అల్పాహారం పెట్టడానికి డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వారు ముందుకు రావడం చాలా అభిందనీయమని ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు.గోకుల్ ప్లాట్స్ లోని వెంకటరమణ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి పని దినాల్లో ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు అల్పాహారం పెట్టడానికి డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వారు ముందుకు రావడం చాలా అభిందనీయమన్నారు.
పిల్లలు ఉదయం పూట ఇంటిదగ్గర తినకుండా రావడంతో ఆకలితో స్కూలుకి వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగ్గా వినకుండా చాలా ఇబ్బంది పడుతుంటారని,అంతే కాకుండా సరైన పోషకాలు అందకుండా అర్ధాకలితో అలమటిస్తుంటారని,ఇటువంటి వారికీ ఇది ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీనివాస్ యాదవ్ తో పాటు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ,సభ్యులుకళ్యాణి,పద్మావతి,విజయలక్ష్మి, ఏఐజీ డాక్టర్స్ కళ్యాణ్,రోహిత్ తో పాటు కాలనీ వాసులు బ్రిక్ శ్రీను,గుమ్మడి శ్రీను,సాంబయ్య,పితాని శ్రీనివాస్,గొర్రెపాటి వివేక్ తదితరులు పాల్గొన్నారు.