సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల గురుకుల పాఠశాలలో 6 గురు విద్యార్థినీలు అశ్వస్థకు గురి అయ్యారు. సిబ్బంది బాలికలను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ మాత శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఎంఈఓ కిషోర్ తెలిపారు. ఎంఈఓ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో చేతులకు తిమ్మిర్లు రావడంతో వణుకుతో అస్వస్థతకు గురయ్యారని అన్నారు.
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో స్నానాలకు వేడి నీళ్లు అందరికి సరిపోకపోవడంతో కొందరు బాలికలు చల్లటి నీళ్లు స్నానం చేయడంతో చలి తీవ్రత తోడు కావడతో బాలికలు అస్వస్థకు గురి అయ్యారని అన్నారు. ఉదయం పూట టిఫిన్లకు వాడిన నూనెనే వాడుతున్నట్టు తల్లిదండ్రుల నుండి సమాచారం. జిల్లా విధ్యాధికారి రాము కస్తూరిభా పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ బాలికలకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు.