ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇల్లంతకుంట మండలం, పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన ఒక దళిత కుటుంబంలో పుట్టి,విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీ పై ఉన్న ఇష్టంతో యువజన నాయకుడిగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఒకప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాదయాత్ర సైతం చేసిన నాయకుడు పసుల వెంకటి. ఒకానొక సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరెళ్ల నియోజకవర్గం నుండి2004 లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిక్కెట్ ఆశించిన సందర్భంలో కొన్ని పరిణామాల మధ్య తనకు టిక్కెట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తనదైన శైలిలో పార్టీకి సేవలు అందించి పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అప్పటి నేరెళ్ల ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో నర్మలనుండి హైదరాబాద్ సచివాలయం వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అప్పటి మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హయాంలో ఆయనతో కలిసి పనిచేయడం జరిగినది.
అంతేకాకుండా ఆ సమయంలో అనేక ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రజలకు కల్పించి ప్రజల్లోనికి తీసుకు పోయినారు. ఆ తర్వాతకాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పిరికెడు మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ, ఎక్కడ కూడా తమ ఆత్మ సైర్యం కోల్పోకుండా ధైర్యంగా నిలబడి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినాడు. ఈ క్రమంలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేసి భయపడిన సందర్భాలు లేకుండా, పార్టీలో తక్కువ మంది కార్యకర్తలు ఉన్నా కూడా హుందాగా ఉంటూ, అప్పటి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఎదిరించి పోరాడిన నాయకుడు పసుల వెంకటి. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో కూడా పాల్గొని ఆయనకు సహకరించడం జరిగినది. ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా వేములవాడ కమాన్ వద్ద ముంపు గ్రామాల ధర్నాకు వెళ్లినప్పుడు పోలీసులతో దెబ్బలు తినడమే కాకుండా, పోలీసులు తమను డీసీఎం వ్యాన్ లో ఇసిరి వేయడం జరిగినది. అప్పుడు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండి పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ తమ జీవితం, తన ఊపిరిగా భావించి మళ్లీ అధికారం కోసం పాదయాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీతో కూడా పాదయాత్ర చేసిన ఘనత పసుల వెoకటి . తనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేసులు నమోదు కావడం జరిగినది. ప్రస్తుత నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,డిసిసి అధ్యక్షులుగా పనిచేసినన్ని రోజులు తమ వెంట నడిచి ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గెలుపు పొందడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఒకానొక సందర్భంలో తాను కేసుల పాలు ,జైలు పాలు ఐన సందర్భాలు కూడా ఉన్నాయి. కావున ఒక నిక్కర్సైన కాంగ్రెస్ కార్యకర్తగా పని చేసిన నాయకుడిని అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరం. అగ్రవర్ణ కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. చిన్న చితక కులాలపై తక్కువ ప్రాధాన్యత చూపించడానికి కారణం ఏమిటీ?, అగ్రవర్ణ కులాలకు చెందిన వారే నాయకులుగా చెలామణి అవుతూ వారే ఎదగాల?. చిన్న కులాల వారిని నిత్యం జండా మోసే బానిసలుగానే ఉండాలా?.వీరు ఉన్నత పదవులు పొందుతూ, ఎందుకు నాయకులుగా ఎదగకూడదు?.పార్టీలోని ప్రతి చిన్న కులానికి చెందిన కార్యకర్తలది ఇదే ఆవేదన.! కావున అగ్రవర్ణ కులాలకు పెద్ద పీట వేసి వారికి ప్రాధాన్యత ఇచ్చి తక్కువ కులాల వారిని పట్టించుకోవడం వలన తగిన మూల్యమే చెల్లించుకున్నది కావున ఆ ప్రభుత్వం చేసిన పొరపాటు ప్రభుత్వంలో జరగకుండా చూసి అట్టడుగు వర్గాల నాయకులను కార్యకర్తలను బు గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవులతో పాటు వివిధ పదవులను ఇచ్చి వారికి అండగా నిలబడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa