సాధారణంగా బ్యాంకులు కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న కస్టమర్లకి చెక్‌లు జారీ చేస్తుంది. యుపిఐ, డిజిటల్ ట్రాన్సక్షన్స్ నడుస్తున్న ఈ యుగంలో కూడా చెక్కుల విలువ అస్సలు చెక్కుచెదరలేదు. అందుకే ప్రజలు ఎక్కువ మొత్తం విత్ డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చెక్కులను వాడేందుకు ఇష్టపడతారు. చెక్కులు ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ కి ఒక ప్రూఫ్ లాగ పరిగణిస్తారు. మీరు కూడా ఎదో ఒక సందర్భంలో చెక్కు ద్వారా ట్రాన్సక్షన్స్ చేసే ఉంటారు. అయితే చెక్కులకి సంబంధించి 9 రకాల బ్యాంక్ చెక్కులు ఉంటాయని తెలుసా? ఏ చెక్ ఎక్కడ ఎప్పుడు ఉపయోగిస్తారంటే ? బేరర్ చెక్: బేరర్ చెక్కుపై పేరు రాసిన వ్యక్తి మాత్రమే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. బేరర్ చెక్కులను 'పేయబుల్ టు బేరర్' చెక్కులు అని కూడా అంటారు. ఆర్డర్ చెక్ : డబ్బు పొందే వ్యక్తి పేరు మొదట్లో పదాలతో రాసి ఉంటుంది దీన్నే ఆర్డర్ చెక్. వీటిని " పేయబుల్ టు ఆర్డర్" చెక్కులు అని కూడా అంటారు. క్రాస్ చెక్ : క్రాస్డ్ చెక్‌లో చెక్కు పైన మూలకు పై భాగంలో 2 గీతాలు ఉంటాయి. చెక్కును ఎవరు ఇచ్చిన ఆ చెక్కుపై రాసిన ఉన్న వ్యక్తి పేరు అకౌంట్లోకి డబ్బు జమ అవుతుంది. క్రాస్ చెక్ ప్రయోజనం ఏమిటంటే పొరపాటున కూడా వేరే వ్యక్తికి డబ్బు వెళ్లకుండా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఓపెన్ చెక్ : ఓపెన్ చెక్‌లను కొన్నిసార్లు అన్‌క్రాస్డ్ చెక్‌లు అని కూడా అంటారు. చెక్ పైన చివరిలో క్రాస్ లైన్స్ లేని చెక్కు ఓపెన్ చెక్ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ చెక్కును సంబంధిత బ్యాంకులో ఇవ్వొచ్చు. చెక్కును ఎవరు ఇచ్చిన చెక్కు పైన ఉన్న పేరు వ్యక్తి అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది. పోస్ట్-డేటెడ్ చెక్: చెక్కు పై వేసిన తేదీ తరువాత మాత్రమే చెక్కు వాలిడిటీ అవుతుంది దిన్నే పోస్ట్-డేటెడ్ చెక్ అంటారు. ఈ చెక్కును జారీ చేసిన డేట్ తర్వాత దానిని ఎప్పుడైనా సంబంధిత బ్యాంకులో అందించవచ్చు. కానీ చెక్కులో ఇచ్చిన తేదీ వరకు కస్టమర్ అకౌంట్లొకి డబ్బు ట్రాన్స్ఫర్ కాదు. స్టెల్ చెక్కు: దీనిని డేట్ అయిపోయిన చెక్కు అని కూడా అంటారు. దీని ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు. దీని వాలిడిటీ మొదట్లో ఆరు నెలలు. ఇప్పుడు 3 నెలలకు తగ్గించారు. ట్రావెలర్స్ చెక్: ఈ చెక్ ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన కరెన్సీకి సమానమైనదిగా పరిగణిస్తారు. ట్రావెలర్స్ చెక్కులు దాదాపు ప్రతిచోటా ఉన్నాయి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి డబ్బు చెల్లించడానికి బ్యాంక్ జారీ చేసే చెక్కు. ట్రావెలర్స్ చెక్‌లకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. మీరు మీ ట్రిప్ సమయంలో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు లేదా ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. సెల్ఫ్ చెక్ : ఒక వ్యక్తి తనకు తాను చెక్కును జారీ చేసినప్పుడు, దానిని సెల్ఫ్ చెక్ అంటారు. ఇందులో నేమ్ కాలమ్‌లో సెల్ఫ్ అనే పదం రాసి ఉంటుంది. కస్టమర్ తన స్వంత ఉపయోగం కోసం బ్యాంకు నుండి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. బ్యాంకర్ చెక్కు : బ్యాంకర్ చెక్కు అనేది కస్టమర్ తరపున బ్యాంకు జారీ చేసే చెక్కు. ఆర్డర్ ద్వారా నిర్ణయించిన మొత్తాన్ని అదే నగరంలో ఉన్న మరొక వ్యక్తికి డబ్బు చెల్లించొచ్చు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa