జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం లారీ ఢీకొని కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో జాతీయ రహదారి-44 పై ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా గత కొన్ని రోజులుగా అండర్ వే బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. దీంతో ఇరుకు ఉన్న సర్వీస్ రోడ్డులో వాహనాలు ప్రయాణిస్తు, తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు పరిష్కారించాలని వాహనదారులు కోరారు.