తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి(M) కొదురుపాక గ్రామ శివారులో బుధవారం టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో టాటాఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 20మంది మహిళలు గాయపడ్డారు. వీరికి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 20మంది మహిళలు టాటాఏస్ వాహనంలో వేములవాడ రాజన్న దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa