వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో ఐకేపి, సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. అదేవిధంగా సేకరించిన ధాన్యాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa