ప్రతిపక్షం.. పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఉనిక' పుస్కకావిష్కరణకు హాజరై వేదికపై పెద్దలందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. విద్యాసాగర్ రావుని తామంతా 'సాగర్ జీ' అని పిలుచుకుంటామని అన్నారు. ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి తన స్వీయ చరిత్ర రాసుకోవడం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.తమిళనాడు (, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలకు ఓకేసారి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారంటే ఆయన సామర్థ్యం ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుర్తించారని అన్నారు. అన్ని పదవులను సమర్ధవంతంగా నిర్వహించి.. తెలంగాణ ఖ్యాతిని పెంచి, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని తెలిపారు. ప్రతిపక్షం.. పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. ఇటీవల జరిగిని అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించలేదని.. గత 13 నెలల కాలంలో ఇదే చూస్తున్నామని అన్నారు. విద్యాసాగర్ రావు మొదలు పెట్టన గోదావరి జలాల వినియోగం ఆలోచన సంపూర్ణంగా పూర్తి కాలేదన్నారు.మహారాష్ట్ర లో ముంపునకు గురవుతోన్న భూమని మనకు ఇప్పిస్తే.. తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను వియోగించుకోవచ్చని అన్నారు. అందుకు విద్యాసాగర్ రావు అనుభవం మనకు ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర సీఎంతో విద్యాసాగర్ రావు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు తో మాత్రమే కాకుండా రీజినల్ రింగ్ లైన్ గురించి కూడా తాము ప్రధాని మోడీతో చర్చించామని అన్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుతెలంగాణకు తీసురావాలని అనుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు మరింత వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa