ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరబిందో కాకతీయ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 03:23 PM

పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు హరిదాసులుగా,గోదాదేవిగా,డూడూ బసవన్నలుగా  ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది. పిల్లలకు భోగి పండ్లను పోయడం, పొంగలి వండడం, బోగిమంటలు వేయడం ఈ కార్యక్రమంలో సందడిగా నిలిచాయి.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన పిల్లల తల్లులకు బహుమతులను డైరెక్టర్ మణి ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా తెలుగు ఉపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ..పండుగ విశిష్టతను పిల్లందరికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మణి, కరస్పాండెంట్ ఆర్వి రమణారావు, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, పాఠశాల ఇంచార్జ్ ఇమ్రాన సుల్తానా, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa