విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్(20707/20708) ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనుందని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ రైలును 2024 మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, ఛైర్‌కార్ కోచ్‌లు 7 ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2కి, ఛైర్‌కార్ కోచ్‌లు 14కి పెరుగుతాయని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa