ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 03:57 PM

రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌  తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాలోని అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందన్నారు. 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ ఉంటుందని వివరించారు. రేషన్‌ కార్డులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయన్నారు. తమ ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడం లేదని స్పష్టం చేశారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వీటి పంపిణీలోనూ ఆదర్శంగా నిలుస్తాం. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేస్తాం. ఈ విషయంపై గుత్తేదారులతో మాట్లాడతాం. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం’’ అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa