వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంబా భవాని ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa