జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని ఉన్నత, ప్రైమరీ , అంగన్వాడీ పాఠశాలల విద్యార్థులకు బోర్ వెల్ చెడిపోయి త్రాగునీరు , ఇతరత్రా అవసరాలకు అసౌకర్యం కలుగుతుంది. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బోర్ వెల్ ను ధర్మపురి ఎమ్మెల్యే స్పందించి మరమ్మత్తు చేయించారు . కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అద్యక్షులు రామగిరి నందయ్య, మండల పార్టీ అధ్యక్షులు టి. శైలేందర్ రెడ్డి ల సహకారంతో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించి నూతన 1హెచ్ . పి బోర్ మోటర్ ను అమర్చారు.
ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు రామగిరి నందయ్య మాట్లాడుతూ బోరు మోటర్ చెడిపోగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వెంటనే స్పందించిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విద్యార్థులు , ఉపాధ్యాయులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి ఎల్లయ్య, చొప్పదండి ప్రశాంత్, ముద్దం దేవయ్య, పోచ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa