ఏకత్వ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా భారతీయ జన సంఘ్ ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరింపజేసిన దీన దయాల్ ఉపాధ్యాయ జీవితం నేటితరం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి అన్నారు. జూలపల్లి మండల కేంద్రంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ 51 వ వర్ధంతిని పురస్కరించుకొని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున జూలపల్లి బస్టాండ్ లో వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కర్రె సంజీవ రెడ్డి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ జె.కె. శేఖర్ యాదవ్ మాట్లాడుతూ..ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం నేడు దేశంలో మూడోసారి దిగ్విజయంగా అధికారం చేపట్టిందంటే దీనదయాలజీ ఉపాధ్యాయ వంటి మహనీయుల త్యాగాలు,వారు అందించిన ప్రేరణదాయకమైన, స్ఫూర్తిదాయక సిద్ధాంతాలే కారణమని, నేటితరం కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడిచి పెద్దపల్లి జిల్లాలో అధికారం దిశగా కమలం జెండా ఎగరేయాలని సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.
దేశం కోసం తన: మన: ధన: సమర్పనే ధ్యేయంగా జీవిత పర్యంతం జీవించిన దీనదయాల్ జీ వర్ధంతి రోజును సమర్పణ దివస్ గా కేంద్ర పార్టీ ప్రకటించిందని వారి స్ఫూర్తిని నేటితరం కార్యకర్తలు కొనసాగించి క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్ట పరచాలని కోరారు.కార్యకర్తలు సమర్పణా భావాన్ని, జాతీయభావాల్ని పెంపొందించుకోవాలని తద్వారా దేశ ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్, సీనియర్ నాయకులు అమరగాని ప్రదీప్ కుమార్, కంకణాల జ్యోతిబసు, మెండే రాజయ్య, పెద్దోళ్ల ఐలయ్య, తీగల అశోక్ గౌడ్, కొల్లూరి స్వామి, మేరుగు కనకయ్య, బుసారపు రవీందర్ గౌడ్, బొజ్జ సంపత్, బెజ్జంకి రమేష్, కోడూరి రాజేశ్వర్, మోహన్ రెడ్డి, అలుభోజు శ్రీనివాస్, ఉప్పుల మనోహర్, గడ్డం తిరుపతి రెడ్డి, మేండే నర్సయ్య, నాడెం రాజీ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa