ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 12:10 PM

భువనగిరి జోన్ డిసిపి రాజేష్ చంద్ర భువనగిరిలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైతుబజర్ , బస్సులో , బ్యాంకు లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఆంద్రప్రదేశ్ విజయవాడ చెందిన దుర్గ , మంగ , లక్ష్మీ అరెస్ట్ చేశారు. మరో యువకుడు యోహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి 3 లక్షల 20 వేల రూపాయల విలువ చేసే 8 తులాల బంగారం, రూ. 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa