ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 04:23 PM

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి జెడ్పి పాఠశాలలో గురువారం పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పోత్కపల్లి జెడ్ పి హెచ్ ఎస్  పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న  విద్యార్ధిని విద్యార్ధులకు పోత్కపల్లి  సబ్ ఇన్స్పెక్టర్ దీకొండ రమేష్,  విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పరీక్షా సామగ్రిని సద్వినియోగం చేసుకొని,మంచి మార్కులు సాధించాలన్నారు.మార్చి నెలలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకోరావలన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో, పట్టుదలతో లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని సూచించారు.వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి భయానికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలన్నారు.జిల్లాలోనే ఓదెల మండలం విద్యార్థులు 100% ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.
పరీక్షల సమయం దగ్గర పడే కొద్ది విద్యార్థులలో ఆందోళన ఉంటుందని భయం ఆందోళన విడి ధైర్యంగా ఉంటే అంతిమ విజయం మీ సొంతం అని ఎస్సై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఏ పోటీ పరీక్షల కైనా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు, ఈ కార్యక్రమం లో  పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa