వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ యునైటెడ్ ముస్లిం ఫోరం, పెద్దపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మస్జిద్ నుండి ప్రారంభమై జెండా చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించి,అనతనం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని,అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని,ఈ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నారని,ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పై పునరాలోచించి తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో దేశవ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలను ఉదృతంగా చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పెద్దపల్లి పట్టణ ముస్లిం యునైటెడ్ ఫోరం సభ్యులు,ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa