ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వేలన్నీ బీజేపీ బలపర్చిన అభ్యర్థుల విజయాన్ని స్పష్టం చేశాయని, మూడు ఎమ్మెల్సీ స్థానాలని కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్ర హోంశాఖా సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని,దమ్ము చూపాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా గెలిపించే బాధ్యతను తీసుకుంటామని సంజయ్ పునరుద్ఘాటించారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనగార్డెనులో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కాశీపేట లింగయ్య, టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలనేది లక్షలాది మంది కార్యకర్తల ఆశయమని అన్నారు. ఎంతోమంది కార్యకర్తలు ఆ కల నెరవేరకుండానే చనిపోయారని నిరాశను వ్యక్తం చేశారు.
నక్సలైట్లను ఎదురించిన వీరులు..
నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే ఉందని, పెద్దపల్లి జిల్లాలోనూ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, కాశీపేట లింగయ్య, కోమల అంజనేయులు వంటి నేతలను చంపాలని నక్సలైట్లు పెద్దపెద్ద పోస్టర్లు సైతం అంటించారని గుర్తు చేశారు. అయినా భయపడకుండా నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడి కాషాయ జెండాను రెపరెపలాడించిన చరిత్ర తమదని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు.
ముస్లీం రిజర్వెషన్లకు వ్యతిరేకం..
రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మనకు గోత్రం, జన్మ నామం, జన్మ నక్షత్రం ఉంటుందని, మొలదారం కట్టుకుంటామని, మన సంప్రదాయాలు వేరని అలాంటి సందర్భంలో హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఒకవైపు బీసీ జనాభాను తగ్గించి చూపుతున్నారని, ఇంకోవైపు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో 10శాతం ముస్లింలకు కేటాయించడం కాంగ్రెస్ పార్టీ కుఠిలనీతికి నిదర్శనమన్నారు. బీసీలకు ద్రోహం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటామని, బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బిల్లు పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భారీగా తరలివచ్చిన కాషాయశ్రేణులు..
పచ్చీస్ ప్రభారీ కార్యక్రమానికి జిల్లలోని కాషాయశ్రేణులు భారీగా తరలివచ్చారు.దీంతో నందనాగార్డెను కిక్కిరిసిపొఇంది.సమావేశానంతరం గుజ్జల రామక్రిష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పెద్దపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులతోపాటు స్థానిక నాయకులతో కలిసి బండి సంజయ్ భోజనం చేశారు.ఈ సమావేశంలో దళితమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,బెజ్జంకి దిలీప్ కుమార్,శివంగారి సతీష్, సిలివేరి ఓదెలు,పర్స సమ్మయ్య, రామగిరి అఖిల్, జంగ చక్రధర్ రెడ్డి,అక్కపల్లి క్రాంతి కుమార్,గనబోఒఇన రాజేందర్, తూడి రవీందర్, సందీప్,గాదె రంజిత్ రెడ్డి, నారాయనస్వామి,కడారి అశోక్ రావు,తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa