జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పాస్ ద్వారా మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలని సూచించారు. ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఎస్ఒ జితేందర్ రెడ్డి, డీపీఓ మధన్ మోహన్, ఎంపీడీవో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa