వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు సూచించారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చట్టాలపై అవగాహన లేమితో ప్రజలు మోసపోతున్నారన్నారు. వస్తు సేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర జాతీయ కమీషన్లను ఆశ్రయించవచ్చని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa