తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై నిర్ణీత వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణను సుప్రీంకోర్టు మార్చి 25కు వాయిదా వేసింది. మార్చి 22లోపు నోటీసులకు రిప్లై ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు.. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీం నోటీసులు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa