ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీల్స్ చిత్రీకరణలో కుర్రాడికి బడితపూజ చేసిన పెద్దాయన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:17 PM

ఇటీవల కాలంలో రీల్స్ సందడి పెరిగింది. ఫోన్ చేతిలో ఉంటే చాలు... యువత రీల్స్ షూట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కొన్ని సార్లు రీల్స్ చిత్రీకరణలో ప్రాణాలు పోగొట్టుకోవడం, కొన్ని రీల్స్ వికటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుర్రాడు రీల్ షూట్ చేసే ప్రయత్నంలో తన్నులు తిన్నాడు.ఇంతకీ ఏం జరిగిందంటే... ఓ కుర్రాడు... ఓ అమ్మాయి పక్కన నిల్చుని టీజ్ చేస్తున్నట్టుగా అభినయిస్తున్నాడు. ఇదంతా రీల్స్ లో భాగమే. కానీ, అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వృద్ధ దంపతులు ఆ అబ్బాయి నిజంగానే అమ్మాయిని ఏడిపిస్తున్నాడని భావించి ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆ పెద్దాయన తన కారులోంచి ఓ కర్ర తీసుకుని కుర్రాడికి బడితపూజ చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఉతికారేశాడు. చివరికి ఆ కుర్రాడ్ని పెద్దాయన తన్నడమే ఒక రియల్ రీల్ అయింది. చుట్టూ ఉన్నవాళ్లు తమ సెల్ ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa